Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాతల సహకారంతో శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో మరమ్మత్తు పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పైకప్పు లీకేజీలు అరికట్టేందుకు ఈ మరమ్మత్త పనులు నిర్వహణ కొనసాగించనున్నారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనుల పర్యవేక్షణ జరగనుంది. ఇపట్టికే శ్రీకాళహస్తిలోని ఆలయంలో మరమ్మతులను పూర్తి చేసిన పుణేకి చెందిన శ్రీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్. ఇక, సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో కూడా మరమ్మత్తు పనులు చెయ్యడానికి శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది.
Read Also: Rashmika Mandanna : దయ.. కరుణ అని వేదాలు వల్లిస్తున్న రష్మిక
అయితే, ఈ నెల 11 వ తేదీన సింహాచలం, 12వ తేదిన శ్రీశైలం ఆలయాల్లో మరమత్తు పనులకు సంబంధించి ఎంఓయూ చేసుకోనుంది. ఇక, సింహాచలం, శ్రీశైలంలోని ఆలయ అధికారులతో ఎంఓయూ పూర్తి చేసుకున్న వెంటనే మరమ్మత్తు పనులు మొదలు పెట్టేందుకు శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ప్లాన్ చేస్తుంది. ఆలయాల్లో ఉన్న లీకేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.