NTV Telugu Site icon

Maharashtra: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Maoists

Maoists

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ కమాండో టీం కూంబింగ్‌ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. గడ్చిరోలిలో నక్సలైట్లు ఎక్కువగా సంచరిస్తారు. ఇటీవల నక్సలైట్ దంపతులు రూ.8 లక్షల రివార్డు తీసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Read Also: S. Jaishankar: రష్యాతో భారత్ సంబంధాలపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు..

గడ్చిరోలి జిల్లాలో రెండు రోజుల క్రితం రూ.8 లక్షల రివార్డుతో నక్సలైట్ దంపతులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంపతులను అసిన్ రాజారామ్ కుమార్ (37) అలియాస్ అనిల్, అతని భార్య అంజు సుళ్య జాలే (28) అలియాస్ సోనియాగా గుర్తించారు. రాజారామ్ కుమార్ ఒడిశాలోని మావోయిస్టుల ప్రెస్ టీమ్‌లో ఏరియా కమిటీ సభ్యుడు అని పోలీసులు తెలిపారు. అతను హర్యానాలోని నర్వానా గ్రామానికి చెందినవాడు.. హిమాచల్‌ సిమ్లా సమీపంలోని ప్రాంతంలో నకిలీ గుర్తింపుతో నివసిస్తున్నాడు.

Read Also: No Romance in Cab: క్యాబ్‌లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్