Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

  • బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్
  • ఇద్దరు మావోయిస్టుల మృతి
Mao

Mao

ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. రాత్రి మళ్ళీ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. గత నాలుగు రోజుల నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు సుధాకర్ తో పాటు భాస్కర్ మృతి చెందారు. భద్రతా బలగాలు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి యాదవ్.. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయాలు..

గత మూడు రోజులుగా నేషనల్ పార్క్‌లో నక్సలైట్లపై ఆపరేషన్ కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో, కోటి రివార్డుతో నక్సలైట్ సుధాకర్, 25 లక్షల రివార్డుతో భాస్కర్ కూడా మరణించారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఇద్దరు టాప్ కమాండర్లతో సహా నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.