NTV Telugu Site icon

Tragedy : విద్యుత్ షాక్‌తో ఉద్యోగి మృతి.. పట్టించుకోని అధికారులు

Dead

Dead

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాలేల్మ గ్రామంలో విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన విధుల్లో భాగంగా గ్రామంలోని కరెంటు స్తంభాలకు విద్యుత్ బల్బులను అమర్చారు. అనంతరం కరెంటును అన్ చేసే క్రమంలో కరెంట్ (LC) తీసుకోకుండే విద్యుత్ లైన్ ను అన్ చేసే సందర్భంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ అవుట్ సోర్సింగ్ కార్మికుడి లక్ష్మయ్య కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న తోట ఉద్యోగులు అప్రమత్తమై స్పృహ కోల్పోయిన లక్ష్మయ్యను హుటాహుటిన జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లక్ష్మయ్య కరెంట్ షాక్ తో మృతి చెందారు.

Gorre Puranam Movie Review: గొర్రె పురాణం మూవీ రివ్యూ

విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబానికి జోగిపేట సిపిఎం పార్టీ అండగా నిలిచింది. సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మృతుడు లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ అధికారుల వైఖరిని తప్పుపడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఉద్యోగి లక్ష్మయ్య మరణించి గంటలు గడుస్తున్న అధికారులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి రాకపోవడం విచారకరం అని సిపిఎం నాయకులు విద్యాసాగర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంతోపాటు ఒకరికి ఉద్యోగం కల్పించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Vizag: వివాహేతర సంబంధం.. ప్రియురాలిపై కత్తితో దాడి..