NTV Telugu Site icon

BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ

Wde

Wde

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో కొందరు సీనియర్లకు ఈసారి సీట్లు దక్కలేదు. దీంతో అగ్ర నేతలు అకలబూనారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సదానందగౌడ్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప.. బీజేపీకి తలనొప్పిగా మారారు. దీంతో ఆయన్న పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేశారు.

ఇది కూడా చదవండి: AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక

తన కుమారుడు కాంతేశ్‌కు హవేరీ నుంచి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఈశ్వరప్ప అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. గతంలో ప్రకటించిన రాజకీయ రిటైర్మెంట్‌ను పక్కనపెట్టి మరీ శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఆయన వ్యవహార శైలిని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగానూ ఈశ్వరప్పను ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: MI vs RR: 5 వికెట్లతో చెలరేగిన సందీప్ శర్మ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఎస్‌ ఈశ్వరప్ప ఐదుసార్లు విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్‌ దక్కేలా చేస్తానని మాట ఇచ్చి మోసగించారంటూ మాజీ సీఎం యడియూరప్పపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం శివమొగ్గ నుంచి బీజేపీ తరఫున యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర పోటీలో ఉన్నారు. టికెట్ రాకపోవడానికి యడియూరప్పనే కారణమని ఆరోపిస్తూ.. తండ్రీకుమారుల నియంత్రణ నుంచి పార్టీకి విముక్తి కల్పించేందుకే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగి బుజ్జగించినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే అధిష్ఠానం ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.

 

శివమొగ్గ ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది. ఏప్రిల్ 12న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఇక్కడ 23 మంది బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణకు చివరి రోజు. కానీ ఈశ్వరప్ప ఉపసహరించుకోలేదు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసింది. బీజేపీ నుంచి బీవై రాఘవేంద్ర, కాంగ్రెస్ నుంచి గీతా శివరాజ్‌కుమార్, కర్ణాటక రాష్ట్ర సమితి నుంచి ఎస్కే ప్రభు, ఉత్తమ ప్రజాకీయ పార్టీకి చెందిన అరుణ కనహళ్లి, యంగ్ స్టార్ ఎంపవర్‌మెంట్ పార్టీకి చెందిన మహ్మద్ యూసుఫ్ ఖాన్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏడీ శివప్ప బరిలో ఉన్నారు.

స్వతంత్ర అభ్యర్థులు కెఎస్ ఈశ్వరప్ప, జి జయదేవ్, ఇహెచ్ నాయక్, చంద్రశేఖర్ హెచ్‌సి, బండి, సందేశ్ శెట్టి ఎ, డిఎస్ ఈశ్వరప్ప, పి శ్రీపతి భట్, ఇంతియాజ్ అత్తార్, రవి కుమార్ ఎన్, పూజ ఎన్ అన్నయ్య, సురేష్ పూజారి, శివరుద్రయ్య స్వామి, జాన్ బెన్నీ, గణేష్ బి ., కునాజే మంజునాథ గౌడ, NV నవీన్ కుమార్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్