NTV Telugu Site icon

Twitter Poll: ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించాలా?.. పోల్‌ ఏర్పాటు చేసిన మస్క్

Twitter Poll

Twitter Poll

Twitter Poll: ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు. జీవితకాల నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై ఓటు వేయాలని మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వినియోగదారులను కోరుతూ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఒక పోల్‌ను ఏర్పాటు చేశారు. 5 గంటల క్రితం ప్రారంభించిన ఈ పోల్ లో ఇప్పటివరకు 55 శాతం మంది పునరుద్ధరించాలని 45 శాతం మంది వద్దని ఓటు వేశారు. ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న ఈ పోల్ లో ఇప్పటికే దాదాపు 55 లక్షల మంది పాల్గొన్నారు. ఈ పోల్ 24 గంటల పాటు జరుగుతుంది. ఈ పోల్ నిర్వహించే ముందు ఎలాన్ మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘‘ప్రజల గళమే దేవుడి గళం’’ అని పేర్కొన్నారు. ఇటీవలే ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత గత ఏడాది జనవరి 6న కాపిటల్ భవనంపై దాడి జరగడంతో ఆ తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Manika Batra: మనిక బాత్రా రికార్డు.. ఆసియా కప్‌ టీటీ ఈవెంట్‌లో కాంస్యం

2020లో యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో జరిగిన తిరుగుబాటు నేపథ్యంలో ట్రంప్ ఖాతా సస్పెండ్ చేయబడింది. దీని ఫలితంగా మాజీ యూఎస్ అధ్యక్షుడికి చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంతో సహా ఈ పద్ధతిలో అనేక నిర్ణయాలు తీసుకున్నందున ఈ కొత్త విధానం ఆశ్చర్యం కలిగించదు. మస్క్ ట్విట్టర్‌ ప్లాట్‌ఫాం నియమాలను ఉల్లంఘించినందుకు గతంలో నిరవధిక నిషేధాలకు లోబడి ఉన్న ఖాతాలను పునరుద్ధరించడం ప్రారంభించాడు. ఖాతాలు పునరుద్ధరించబడిన మొదటి వ్యక్తులలో రచయిత జోర్డాన్ పీటర్సన్, హాస్యనటుడు కాథీ గ్రిఫిన్ ఉన్నారు.

Show comments