NTV Telugu Site icon

Elon Musk: భారత ఎన్నికల విధానంపై ఎలాన్ మస్క్ ప్రశంసలు..

Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ‘భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు?’ అనే హెడ్‌లైన్‌తో ప్రచురించి ఓ వార్తా కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘భారతదేశం ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది. కానీ కాలిఫోర్నియా ఇంకా లెక్కింపు దశలోనే ఉంది.’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు. అయినా అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటం గమనార్హం.

READ MORE: Pushpa 2 : నైజాం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పుష్ప – 2’

కాగా..ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ గతంలో సమర్థించారు. అంతేకాదు ఓటింగ్‌ మెషీన్‌పై కూడా ఆందోళన కరమైన అంశాన్ని పంచుకున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఆరోపించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు మస్క్ చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. భారతదేశంలో కూడా ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) విషయంపై గతంలో మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

READ MORE:UP: సంభాల్ జామా మసీదు-హరిహర్ ఆలయ వివాదం.. రీ సర్వేకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి..