NTV Telugu Site icon

Elon Musk: తన కొడుకుకు ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టిన ఎలాన్ మాస్క్.. ఇంతకీ ఎవరతను?

Elon Musk

Elon Musk

టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ తన కుమారుల్లో ఒకరికి ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టారు. తన కొడుకు పేరులో భారతీయ శాస్ర్తవేత్త ‘చంద్రశేఖర్‌’‌ను చేర్చారట. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ 2023లో వెల్లడించారు. కెనడాకు చెందిన శివోన్‌ అలీసా జిలిస్‌తో కలిగిన కవలల్లోని ఒక కుమారుడి మధ్య పేరు ‘చంద్రశేఖర్‌’గా పెట్టినట్లు ఎలాన్‌ మస్క్‌ తనతో చెప్పినట్లు రాజీవ్ వెల్లడించారు. భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ప్రొ.సుబ్రమణ్యం చంద్రశేఖర్‌‌ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

READ MORE: Satya Kumar Yadav: పుష్ప-2 సినిమాపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఆయన సీవీ రామన్‌కి స్వయానా మేనల్లుడు. చంద్రశేఖర్‌1910 అక్టోబర్ 19న లాహోర్‌లో జన్మించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. ఖగోళ శాస్త్రంలో చంద్రశేఖర్ పరిశోధనలు చేశారు. నక్షత్రం పుట్టుక, అభివృద్ధి, వినాశనం అయ్యే క్రమాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ పరిశోధన వివరాలు, 1939లో ఆయన రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ స్టెల్లార్ స్ల్రక్చర్’ అనే పుస్తకంలో ప్రచురించారు. అదే సమయంలో ఆయన పేరు, నోబెల్ పురస్కారం చర్చల్లో నిలిచింది. కానీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడిన్‌బర్గ్ ఆయన పరిశోధనపై అభ్యంతరం తెలిపారు.

READ MORE: Maha Kumbh: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. మూడోసారి

ఎడిన్‌బర్గ్ కారణంగా చంద్రశేఖర్ సరైన సమయంలో నోబెల్ పురస్కారాన్ని అందుకోలేకపోయారు. కానీ 1983లో ఆయన పరిశోధన సరైనదేనని నిరూపితం కావడంతో భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్‌ అవార్డును గెలుచుకున్నారు. భౌతిక శాస్త్ర విభాగంలో 1930లో నోబెల్ అవార్డు అందుకున్న సర్ సీవీ రామన్ మేనల్లుడే సుబ్రమణ్యం చంద్రశేఖర్. ఉపఖండం నుంచి భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డును గెలుచుకున్న మూడో శాస్త్రవేత్తగా చంద్రశేఖర్ నిలిచారు. 1995 ఆగస్టు 21న అమెరికాలోని చికాగోలో ఆయన మరణించారు.