NTV Telugu Site icon

Twitter: ట్విట్టర్‌ యూజర్లకు మస్క్‌ బంపరాఫర్.. ఇలా సంపాదించుకోండి..!

Elon Musk

Elon Musk

Twitter: ఎలాన్‌ మస్క్‌ ఎంట్రీ తర్వాత సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి అనేక మంది ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్‌.. బ్లూటిక్‌కు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.. అంతేకాదు.. ట్విట్టర్‌ యూజర్లు అందరికీ ఆయన షాకిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది.. ఇక, ట్విట్టర్‌ లోగాలోనూ మార్చులు జరిగాయి.. అయితే, బిజినెస్‌ ఎలా చేయాలనే దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్న మస్క్‌.. ఇప్పుడు ట్విట్టర్‌ యూజర్లకు బంపరాఫర్‌ ప్రకటించారు.. తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం యూజర్లకు కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

ట్విట్టర్‌ ద్వారా డబ్బులు సంపాదించుకునే పనిలోపడిపోయిన ఎలాన్‌ మస్క్‌.. యూజర్లకు ఆ అవకాశం ఎలా? ఇస్తారు అనే విషయాల్లోకి వెళ్తే.. ఏదైనా ఎక్కువ సమాచారం నుంచి ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ తో డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుందని వివరించారు.. అయితే, ఈ ఆప్షన్‌ ప్రస్తుతానికి అమెరికా లాంటి దేశాల్లో అందుబాటులో ఉండగా.. భారత్‌లో మాత్రం ఇంకా ప్రారంభించలేదు.. మరికొన్ని రోజుల్లో అన్ని దేశాలకు ఈ ఆప్షన్‌ విస్తరింపజేసే పనిలో పడిపోయింది ట్విట్టర్‌… ఇక, మొదటి 12 నెలల పాటు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వినియోగదారులు సంపాదించే డబ్బులో ట్విట్టర్‌ ఎలాంటి మొత్తాన్ని తీసుకోదట.. అంటే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే ఇస్తారు.. కానీ, ట్విటర్‌ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు వసూలు చేయనున్నాయి.. అంతే కాకుండా తమ కంటెంట్ ప్రమోట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.. ట్విట్టర్ ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌తో డబ్బు ఆర్జించే ప్రయత్నాలతో పోరాడుతోంది. ఇప్పుడు వినియోగదారులు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించారు.

ట్విట్టర్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రకారం, “లాంగ్‌ఫార్మ్ టెక్స్ట్ నుండి గంటల నిడివి గల వీడియో వరకు” వారి కంటెంట్‌కు యాక్సెస్ కోసం ఛార్జ్ చేయడానికి ట్విట్టర్ వినియోగదారులను అనుమతిస్తుంది. మస్క్ ప్రజలు తమ ట్విట్టర్ ఖాతాల నుండి డబ్బు సంపాదించడం సాధ్యమయ్యేలా చేయడానికి న్యూస్‌లెటర్ కంపెనీ అయిన సబ్‌స్టాక్‌తో పోటీ పడుతోంది. ఇంతలో, సబ్‌స్టాక్ ట్విట్టర్‌ను పోలి ఉండటం ప్రారంభించింది. సైట్ ఇటీవల గమనికలను పరిచయం చేసింది, ఇది వినియోగదారులను పబ్లిక్ ఫీడ్‌లో పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ వారం ప్రారంభంలో ఒక ట్వీట్‌లో సబ్‌స్టాక్ లింక్ ఉంటే Twitter ఇష్టాలు, ప్రత్యుత్తరాలు మరియు రీట్వీట్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్లాట్‌ఫారమ్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు.. ఎక్కువ మంది కంటెంట్ సృష్టికర్తలను ప్రలోభపెట్టవచ్చు లేదా వారిని విడిచిపెట్టకుండా నిరోధించవచ్చు అని అంచనా వేస్తున్నారు.. ట్విట్టర్ మొదటి సంవత్సరం వినియోగదారుల సబ్‌స్క్రిప్షన్ రాబడిలో కోత తీసుకోనప్పటికీ, భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఇది ఒక చర్య కావచ్చు అంటున్నారు.