Epstein Files: అమెరికన్ రాజకీయాల్లో ప్రముఖ ఫైనాన్షియర్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టైన్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కొత్త పత్రాలు వెలుగుచూశాయి. ప్రపంచ కుబేరుడు ఈ తాజా పత్రాలతో కొత్త చిక్కుల్లో చిక్కున్నాడు. ఇంతకీ ఆ ప్రపంచ కుబేరుడు ఎవరని అనుకుంటున్నారు.. టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్. ఆయనకు కొత్త చిక్కులు ఏంటని ఆలోచిస్తున్నారా.. అమెరికాలో సంచలనం రేపుతున్న ప్రముఖ ఫైనాన్షియర్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన కొత్త పత్రాలలో మస్క్ పేరు బయటికి వచ్చింది. తాజా ఫైళ్లల్లో మస్క్, ఎప్‌స్టైన్ మధ్య సంబంధాలను బహిర్గతం చేసింది. ఈ కొత్త పత్రాలు అమెరికన్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.
READ ALSO: India At UN: రన్ వేలు ధ్వంసమైనా సిగ్గు లేదా.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. డిసెంబర్ 2014 నుంచి యుఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి సమర్పించిన పత్రాలలో మస్క్‌ను ఎప్‌స్టైన్ ఒక ప్రైవేట్ ద్వీపానికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ ఫైళ్లలో చేతితో రాసిన నోట్ కూడా కనిపించింది. ఇందులో మరిన్ని సంచనాలు జరగబోతున్నాయా అని రాసి ఉంది. విషయం ఎలోన్ మస్క్‌కు తెలియగానే ఆయన ప్రపంచం నుంచి తన ముఖాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ విషయంపై సోషల్ మీడియాలో బహిరంగంగా వ్యాఖ్యానించాడు.
ఆసక్తికరంగా మస్క్ సమాధానం..
ఎప్‌స్టైన్ ఫైల్స్‌లో ఎలాన్ మస్క్ పేరు కనిపించిందనే విషయం బయటికి రాగానే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం ప్రారంభమైంది. సోషల్ మీడియాలో తన పేరు మీద జరుగుతున్న రచ్చపై.. వెంటనే మస్క్ స్పందించారు. ఒక్క ముక్కలో ఇది అబద్ధం అని ఆయన స్పష్టం చేశాడు. దీనికి మించి ఆయన ఇంకేమీ చెప్పలేదు. ఈ అంతర్జాతీయ లైంగిక అక్రమ రవాణా ముఠాలో ఎలోన్ మస్క్ మాత్రమే కాకుండా, అనేక ఇతర కొత్త పేర్లు కూడా వెలుగు చూశాయి. టెక్ లీడర్ పీటర్ థీల్, రాజకీయ కార్యకర్త స్టీవ్ బానన్ పేర్లు కూడా ఈ ఫైల్స్‌లో బయటికి వచ్చాయి. థీల్ ఒక ప్రముఖ సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్త, అలాగే పెట్టుబడిదారుడు. అలాగే ఆయన పేపాల్, పలాంటిర్ వంటి కంపెనీల సహ వ్యవస్థాపకుడు. ఆయన డోనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితం ప్రారంభంలో మద్దతుదారుడిగా ఉన్నారు. స్టీవ్ బానన్ మాజీ వైట్ హౌస్ చీఫ్ స్ట్రాటజిస్ట్, అలాగే ప్రముఖ మీడియా కంపెనీ బ్రీట్‌బార్ట్ న్యూస్ అధిపతి. ట్రంప్ ఎన్నికల వ్యూహాల వెనుక బన్నన్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
READ ALSO: Musi River : పురానాపూల్ వంతెన వద్ద ప్రమాద స్థాయిని దాటిన వరద