NTV Telugu Site icon

Elon Musk: ప్రపంచంలో అన్నింటి కంటే ఆ విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది

Musk

Musk

Book on Elon Musk Biography: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవితంలో ఉన్న అతి పెద్ద బాధాకరమైన విషయం బయటపడింది. మస్క్ జీవితంలోని ప్రతి అంశాన్ని చేర్చి ఆయన బయోగ్రఫీని బుక్ గా రాస్తున్నారు వాల్టర్ ఐసాక్సన్. ఇక ఈ పుస్తకం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఇందులో ఎలాన్ మస్క్ కు సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఇక ఈ విషయాలను మస్క్ పుస్తక రచయిత వాల్టర్ ఐసాక్సన్ తో పంచుకున్నారు. ఈ పుస్తకం ద్వారా మస్క్ గురించి మునుపెన్నడు తెలియని కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆయన బయోగ్రఫీలోని కొన్ని కీలక వివరాలు తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో వచ్చాయి. ఇందులో తన కూతురికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మస్క్ పంచుకున్నారు. వీటిని తెలుసుకుంటే ఓ తండ్రిగా మస్క్ ఎంత బాధను అనుభవిస్తున్నారో అర్థం అవుతుంది. మస్క్ లో ఇంత సెన్సిటివ్ కోణం కూడా ఉందా అనిపిస్తోంది.

Also Read: Nagapur: మానవత్వం మరచిన దంపతులు.. చిన్నారి ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు

పుట్టుకతో పురుషుడైన మస్క్ కూతురు తరువాత స్త్రీగా మారిన సంగతి తెలిసిందే. తన స్కూల్ కారణంగా తన బిడ్డ ఇలా మారిందని కూడా మస్క్ అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు తనకు తండ్రితో ఎలాంటి సంబంధం ఉండకూడదని మస్క్ కూతరు చట్టపరంగా తన పేరును కూడా మార్చకుంది. గతేడాది తన తండ్రితో కానీ, ఆయన ఆస్తితో కానీ, ఆయకు సంబంధించిన వేటితో తనకు సంబంధం లేకుండా తన పేరు మార్చుకోవడానికి అనుమతినివ్వాలని కోర్టుకెక్కిన మస్క్ కూతరు తన అసలు పేరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ తీసేసి వీవియన్‌గా తన గుర్తింపును మార్చుకుంది. ఇక ఈ విషయంల గురించి మస్క్ మాట్లాడుతూ తన కూతురితో విబేధాలు తనను ఎంతో బాధిస్తాయని, తనతో గొడవలకు స్వస్తి పలకడానికి ఎన్ని సార్లు ప్రయత్నించిన తన కూతురు తనతో ఉండటానికి అంగీకరించడం లేదని వాల్టర్ ఐసాక్సన్ కు తెలిపారు. అంతేకాదు తన కూడా సోషలిజం నుంచి పూర్తిగా కమ్యూనిజం వైపు వెళ్లిపోయిందని, డబ్బున్న ప్రతి ఒక్కరూ చెడ్డవారు అనే స్థితికి చేరుకుందని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన మొదటి బిడ్డ నివేద మరణం తరువాత తనను అంతగా బాధిస్తున్న విషయం తన కూతరు వీవియన్ తో ఉన్న విభేదాలే అని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు.