Nagapur: మానవత్వం మరచిన దంపతులు.. చిన్నారి ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagapur Wife and Husband Harassed a Minor Girl: ఓ జంట మానవత్వం మరచిపోయింది. ఇంట్లో పనికి చిన్నారిని తెచ్చుకోవడమే నేరం, అలాంటిది వారు ఆమెను చిత్ర హింసలకు కూడా గురిచేశారు. నాగపూర్ లోని నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలో ఈ ఘటన జరిగింది. చిన్నారి ఏ తప్పు చేసిన ఆమెను దారుణంగా హింసించే వారు ఓ జంట. వేడిపాన్, కత్తులు, సిగరెట్లతో కాలుస్తూ హింసించే వారు. దంపతులు బయటకు వెళ్లిన సమయలో చిన్నారిని చుట్టు పక్కల వారు రక్షించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Also Read: Pawan Kalyan: ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వివరాల ప్రకారం నాగపూర్ కు చెందిన ఓ జంట బెంగుళూరు నుంచి ఓ 12 ఏళ్ల బాలికను ఇంట్లో పని చేయడం కోసం తెచ్చుకున్నారు. అసలే మైనర్ లను పనిలో పెట్టుకోవడమే నేరమైతే ఈ జంట ఆ చిన్నారిని చిత్రహింసలకు కూడా గురిచేసింది. చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్ష విధిస్తూ ఆ బాలికకు నరకం చూపించింది ఆ కసాయి జంట. ఇక ఆ జంట పని మీద బెంగుళూరు వెళుతూ చిన్నారిని ఇంట్లో పెట్టి వెళ్లింది. నాలుగు రోజులు వారు రాకపోవడంతో ఆ చిన్నారి సాయం కోసం అరిచింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆ బాలికను రక్షించారు. ఆమెను ఎన్జీవో సంస్థలకు అప్పగించారు. ఇక ఎన్జీవో ప్రతినిధి మాట్లాడుతూ ఆ దంపతులు చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించేవారని, ఏ చిన్న తప్పు చేసిన వేడి పాన్, వేడి కత్తి, సిగరెట్లతో కాలుస్తూ నరకం చూపించే వారని వెల్లడించారు.అంతే కాకుండా ఆమెకు సరిగా తిండి కూడా పెట్టే వారు కాదని తెలిపారు. ఆమెను కాపాడిన అనంతరం బాలికను చిత్ర హింసలకు గురిచేసిన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్జీవో సంస్థ ప్రతినిధులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి ఆ దంపతులపై మైనర్ ను పనిలో పెట్టుకున్నందకు అలాగే చిత్ర హింసలు పెట్టినందకు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!