Site icon NTV Telugu

Elon Musk Shocking Desicion : ఎలాన్ మస్క్ నిర్ణయంతో ఆందోళన చెందుతున్న ట్విటర్ ఉద్యోగులు

Elon Musk Twitter 2

Elon Musk Twitter 2

Elon Musk Shocking Desicion : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ సీఈవో స్థానాన్ని ఎలాన్ మస్క్ చేపడతారని తెలుస్తోంది. కంపెనీ హెడ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నారని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఇప్పటికే టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలకు బాస్‌గా మస్క్ ఉన్నారు. ట్విట్టర్‌కు ఓనర్‌గా మారిన మస్క్.. సీఈవో బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

Read Also: Amitabh Wife Shocking Comments: పెళ్లి కాకుండానే పిల్లలను కనొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ వైఫ్

ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా సిద్ధం చేయాలని సంస్థ మేనేజర్లను ఆదేశించారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన వెంటనే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల అధిపతులను మస్క్ తొలగించారు. ఇక కంపెనీలో పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగులలో దాదాపు 75 శాతం మందిని వదిలించుకోవాలని యోచిస్తున్నట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్‌ 1లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని చూస్తున్నారని వెల్లడించారు.

Read Also: Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

కాగా, ఉద్యోగుల తొలగింపుపై జరిగిన ప్రచారాన్ని మస్క్‌ ఇప్పటికే తోసిపుచ్చారు. తానొస్తే 75 శాతం ఉద్యోగాలను తీసేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కరెక్టు కాదని, అలాంటి ఆలోచన లేదని ఆయన ఉద్యోగులతో అన్నట్లు తెలుస్తున్నది. అయితే ట్విట్టర్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ 2023 చివరి నాటికి కంపెనీ పేరోల్‌ (వేతనాల మొత్తం)ను సుమారు 800 మిలియన్ డాలర్లకు తగ్గించాలని అనుకుంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదికలు వెల్లడించాయి. అంటే దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తుందన్నమాట. మరి ట్విట్టర్‌లో ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి.

Exit mobile version