NTV Telugu Site icon

Road Rage: అమానుషం.. పోలీసు కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన వైనం.!

Road Rage

Road Rage

Road Rage in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపాడు. అంతే కాదు నిందితుడు పోలీసు కానిస్టేబుల్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో గుద్ది చంపేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసుల ప్రకారం, రాత్రి సమయంలో కానిస్టేబుల్ వాహనాన్ని తీసివేయమని నిందితుడిని కోరాడు. ఈ విషయంపై వారు కానిస్టేబుల్‌ను సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో ఢీకొట్టారు. ఘటనానంతరం కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని., అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. మీడియా కథనాల మేరకు పోలీసులు కారును సీజ్ చేశారు.

Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..

ఢిల్లీలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో, ‘ఢిల్లీలో శాంతిభద్రతలు ముగిశాయి. పూర్తి అడవి పాలన ఉంది. దేశ రాజధానిలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. ఢిల్లీలోని శాంతిభద్రతల వ్యవస్థ అమిత్ షా ఆధ్వర్యంలోకి వస్తుంది. ఈ ఘటనలను అరికట్టేందుకు వారు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను నిలదీశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద ఉన్నారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాయి.