Site icon NTV Telugu

Elephants Roaming: ఏనుగుల బీభత్సం.. అక్కడ మహిళపై దాడి.. ఇక్కడ?

Elephants

Elephants

తెలుగు రాష్ట్రాలను ఏనుగుల గుంపు భయపెడుతోంది. ఒడిస్సా నుంచి ఈ మధ్యనే తరలివచ్చిన ఆరు ఏనుగుల గుంపు స్థానికులను భయపెడుతోంది. అధికారులను ఎంత బ్రతిమాలిడినా వారేం చేయలేదు. చివరకు వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ వైర్లు అమర్చారు. దీంతో విద్యుత్ షాక్ తో నాలుగు గజరాజులు మృతిచెందాయి. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాయి మరో రెండు ఏనుగులు. పార్వతీపురం మన్యం జిల్లాలో బామిని మండలం కాట్రగడ పంచాయతీ సమీపంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందడం కలకలం రేపుతోంది.

Read Also: Goods Train Derailed: మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 4 వ్యాగన్లు

గత కొద్ది కాలంగా బామిని ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. పొలంలో పడివున్న ఏనుగులను గుర్తించారు స్థానికులు. ఏనుగుల మృతికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు..ఇటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల తాడిలో మహిళ మృతి చెందడం విషాదం నింపింది. కుప్పం నియోజకవర్గం, మల్లనూర్ మేజర్ గ్రామపంచాయతీలోని జీడూరు గ్రామంలో నివసిస్తున్న మహిళ ఉష (35) ఏనుగుల దాడిలో మృతి చెందింది. తమిళనాడు నుండి కుప్పం అటవీ ప్రాంతానికి ఏనుగులను మళ్లించారు తమిళనాడు అటవీశాఖ అధికారులు. దీంతో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భయాందోళనలో మల్లనూర్ పరిసర గ్రామ ప్రజలు..ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు కుప్పం అటవీ శాఖ అధికారులు.

Read Also: Wedding Gown : ఈ పెళ్లి గౌన్ గిన్నీస్ రికార్డ్ సాధించిందా.. ఏముంది అందులో స్పెషాలిటీ ?

Exit mobile version