Elephant Died: మన్యం జిల్లాలో అనారోగ్యంతో ఏనుగు మృతి..

  • గత రెండు రోజులుగా ఆరోగ్యంతో బాధ పడతూ ఈరోజు ఉదయం వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి.
  • తోటపల్లి - సంతోషపురం గ్రామల సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో మృతి.
  • తోటపల్లి నాగవలి నది పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు.
Elephant Died

Elephant Died

Elephant Died: బుధవారం నాడు పార్వతిపురం మన్యం జిల్లాలో ఉదయం వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందింది. గడిచిన రెండు రోజులగా ఆ ఏనుగు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా.. నేడు ఉదయం ఆ ఏనుగు తనువు చాలించింది. నేడు ఉదయం తోటపల్లి – సంతోషపురం గ్రామం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగుకు 17 సంవత్సరాల వయసు ఉంటుందని., ఏనుగును ఆడ ఏనుగుగా గుర్తించారు అధికారులు.

Ntr Film Awards: ‘ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’కి విశిష్ట అతిథులుగా తెలంగాణ మంత్రులు

ప్రస్తుతం తోటపల్లి నాగవల్లి నది పరివాహ ప్రాంతాలలో మొత్తం ఆరు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు ఏనుగుల మరణాలతో కలిపి నేటికీ 4 ఏనుగులు మృతి చెందినట్లు తెలిపారు. ఇక ఏనుగుల సమస్య సమస్య కొరకు శాశ్వత పరిష్కారాన్ని కృషి చేయాలని అటవీశాఖ అధికారులను గ్రామ ప్రజలు కోరారు.

Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం