Site icon NTV Telugu

Mini Countryman Electric JCW: మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 462KM రేంజ్

Mini Countryman Electric Jc

Mini Countryman Electric Jc

మినీ ఇండియా తన అద్భుతమైన ఎలక్ట్రిక్ SUV కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ JCW ప్యాక్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇది కంట్రీమాన్ ఎలక్ట్రిక్ ప్రామాణిక వెర్షన్ కంటే ఎక్కువ స్పోర్టీ, ప్రీమియం లక్షణాలతో వస్తుంది. దీనిలో 20 యూనిట్లు మాత్రమే భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. భారత మార్కెట్లో దీని డెలివరీ జూన్ 10, 2025 నుంచి ప్రారంభమవుతుంది. బుకింగ్ రూ. 1.5 లక్షల చెల్లించి చేసుకోవచ్చు.

Also Read:Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..

ఇది భారత్ లో రూ.62 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. ఇది JCW ఎడిషన్. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, లెజెండ్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దీని లెజెండ్ గ్రే వెర్షన్‌లో స్టైలిష్ బ్లాక్ స్పోర్ట్స్ స్ట్రిప్స్, ఫ్రంట్ గ్రిల్, బంపర్‌పై రేసింగ్-ప్రేరేపిత చెకర్డ్ డిజైన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ సైడ్ స్కర్ట్‌లు, రియర్ స్పాయిలర్, JCW బ్యాడ్జింగ్ ఉన్నాయి.

Also Read:Maganti Gopinath: మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేష్

దీని ఇంటీరియర్.. బూస్ట్ మోడ్‌తో JCW స్టీరింగ్ వీల్, స్పోర్ట్స్ సీట్లు, బ్లాక్-రెడ్ థీమ్డ్ డాష్‌బోర్డ్, 9.4-అంగుళాల OLED టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే/ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే సమయంలో, ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, TPMS, వెనుక కెమెరా, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read:Pooja Hegde : నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది..

ఇది 66.45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 204 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత బ్యాటరీ 462 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.6 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 170 కి.మీ. దీని బ్యాటరీ 130 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10-80% ఛార్జింగ్ నుంచి కేవలం 29 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 11 kW AC ఛార్జర్‌తో 0-100% ఛార్జింగ్‌కు 6.4 గంటలు పడుతుంది.

Exit mobile version