NTV Telugu Site icon

Hyderabad: రేపు తెలంగాణ ఒలింపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు..

Okampic

Okampic

రేపు హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జరుగనున్నాయి. ఉద‌యం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫ‌లితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, బ్యాడ్మింట‌న్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌ నాథ్‌ పోటీ ప‌డుతున్నారు. కార్యద‌ర్శి ప‌ద‌వి బ‌రిలో మ‌ల్లారెడ్డి, బాబురావు నిలిచారు.

Read Also: Assembly Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!

ఇదిలా ఉంటే.. మూడ్రోజుల క్రితం అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న చాముండేశ్వరీ నాథ్‌ తెలంగాణ స్పోర్ట్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌ను కలిశారు. ఈ ఎన్నికలను ఆపాలని వారిని కోరారు.. ఎన్నికల ఓటర్‌ లిస్ట్‌ను ఐఓఏ వన్‌ మెన్‌ కమిషన్‌ దర్యాప్తు అనంతరం.. ఎన్నికల ఓటర్‌ జాబితా సరి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఏపీ.జితేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుగా క్యాబినెట్‌ ర్యాంకులో ఉండడంతో ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదని, గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేసిన వివేక్‌ను అనర్హులుగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో.. తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

Read Also: President Droupadi Murmu: రేపు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Show comments