NTV Telugu Site icon

ELECTIONS 2024 : కాంగ్రెస్​ నాలుగో జాబితా రిలీజ్ – మోడీ పై పోటీ చేసేది ఈయనే..!

4

4

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాలుగో జాబితాను 46 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. ఇందులో రాజ్‌ గఢ్‌ నుంచి మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నుంచి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్ పోటీ చేయనున్నారు. తాజాగా విడుదలైన జాబితాలో మధ్యప్రదేశ్‌ నుంచి 12, ఉత్తరప్రదేశ్‌ నుంచి 9, తమిళనాడు నుంచి 7, రాజస్థాన్‌ 3, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, జమ్ము కశ్మీర్‌లో రెండేసి స్థానాలకు అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది.

ALSO READ: IPL 2024 Tickets: విశాఖలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకం నేటి నుంచి అన్లైన్ లో ప్రారంభం..!

వీరితోపాటు అసోం, బంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులలో ఒక్కో స్థానానికి సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ తాజా జాబితాతో ఇప్పటివరకు కాంగ్రెస్ మొత్తం 184 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పై ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ పోటీ చేయనున్నారు. ఈయన ఇదివరకే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వారణాసి లోక్‌ సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

ALSO READ: Motorola Edge 50 Pro : మార్కెట్లోకి వచ్చేస్తున్న మోటోరోలా స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?

రాయ్‌.. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1996-2007 మధ్య 3 మార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఆపై జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఆయన గెలుపొందారు. ఎమ్మెల్యేగా 2012లో మరోసారి గెలిచారు అజయ్‌ రాయ్‌.