దేశంలో రెండో దశలో భాగంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు మరోకొన్ని సంస్థలు కూడా ప్రయత్నాన్ని చేశాయి. ఈ కార్యక్రమం కోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక సంస్థలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరు నగరంలోని వివిధ హోటల్లో కొత్తగా శ్రీకారం చుట్టాయి.
Also Read: Lok Sabha Elections: నామినేషన్లలోనూ మల్కాజిగిరే టాప్
నేడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఓటు వేసి వచ్చారో.. వారికి దోశలు, లడ్డు, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను కొన్ని హోటల్లో ఉచితంగా ఇచ్చారు. మరికొన్ని హోటల్స్ లో సబ్సిడీ రూపంలో కూడా అందజేశాయి. ఈ దెబ్బతో బెంగళూరు నగరంలోని రెస్టారెంట్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
Also Read: Viral Video : పెళ్లి డ్రెస్సులోనే ఓటువేసిన పెళ్లికూతురు.. ఎక్కడంటే?
ముఖ్యంగా బెంగళూరు మహానగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని పలు రెస్టారెంట్ల సహాయంతో వారి ప్రయత్నంగా చేపట్టారు. ఇందులో భాగంగా ‘ఓటు వేయండి – ఫుడ్ తినండి ‘ అనే నినాదంతో దోశ, లడ్డు, జ్యూస్ వంటి వాటిని ఉచితంగా అందించారు. ఈ లెక్కన నగరంలోని ఒక్క నిసర్గ గ్రాండ్ హోటల్ వద్దనే 2000 మందికి పైగా వీటిని అందించారు.