NTV Telugu Site icon

Election Commission: పోలింగ్‌ తేదీ తర్వాతే ఆ పథకాల సొమ్ము జమ చేయండి..!

Ec

Ec

Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిలకు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన తర్వాతే.. సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలని సూచించింది ఎన్నికల కమిషన్‌.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు పోలింగ్ తేదీ తర్వాత నగదు జమ చేసుకోవచ్చని ఏపీ హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే దీనిపై స్పందించిన ఈసీ.. పోలింగ్ తేదీ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టుకు తెలిపింది.. డిసెంబర్, జనవరి ఇలా పెండింగ్ లో ఉన్న వారికి ప్రభుత్వం నగదు జమ చేస్తూ వస్తోందని ఈ నెల 13న పోలింగ్ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. ఇక, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలనే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది.

Read Also: Sitaram Yechury: రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్లాన్‌..! ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తులో కీలకం