Site icon NTV Telugu

MP Laxman: శ్రీ రాముని కళ్యాణ ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడం విచారకరం..

Laxman

Laxman

రేపు జరిగే శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల శ్రీ రాముని కళ్యాణ ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ కళ్యాణ మహోత్సవంపై ఆంక్షలు విధించడం చాలా విచారకరం అన్నారు. గత 40 ఏళ్లుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితి లేదు.. అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత జరిగే మొదటి శ్రీ రామ నవమి.. ఇందులో రాజకీయ పరమైన కోణం ఉన్నట్లు మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు అనుమానం కలుతుందని ఎంపీ లక్ష్మఱ్ చెప్పుకొచ్చారు.

Read Also: AP Elections 2024: డ్వాక్రా గ్రూప్‌లకు ఈసీ కీలక ఆదేశాలు

ఇక, గతంలో కేసీఆర్ కూడా కళ్యాణానికి వెళ్లకుండా కేవలం తన కుటుంబ సభ్యులతో తలంబ్రాలు పంపాడు.. ఆ తరువాత కేసీఆర్ కి ఎలాంటి గతి పట్టిందో ఇప్పుడు అందరం చూస్తున్నాం అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మీ ప్రభుత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తే మీకు కూడా అలాంటి గతే పడుతుంది.. రేపు జరిగే శ్రీరామ నవమి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అంశంపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేనిపోతే తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వెల్లడించారు.

Exit mobile version