NTV Telugu Site icon

AP Voters List Announced: ఏపీలో ఓటర్ల జాబితా రెడీ.. ఎంతమందో తెలుసా?

Voters

Voters

ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించింది ఎన్నికల సంఘం. జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల అధికారి. ఈ ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 3,99,84,868 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు: 1,97,59,489 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 2,02,21,455 మంది వున్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా వున్నారు. వీరు కాకుండా థర్డ్‌ జెండర్‌ ఓటర్లు కేవలం 3924 మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల మూడువేల 225 మంది ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19,42,233 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,29,085 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.గతేడాది కాలంలో తగ్గిన 7,51,411 మంది ఓటర్లు.

Read Also: Kalyanam Kamaneeyam: ఇది కదా ట్రైలర్ అంటే!?

ఈ జాబితా ప్రకారం డ్రాఫ్ట్ జాబితాలో పురుష ఓటర్లు కోటి 96 లక్షల 49 వేల 849 మంది ఉండగా… తుది జాబితాలో కోటి 96లక్షల 93 వేల 678 గా వున్నారు. ఇటు మహిళా ఓటర్లు డ్రాఫ్ట్ జాబితాలో 2 కోట్ల 1 లక్షా 32 వేల 271 మంది కాగా, తుది జాబితాలో వారి సంఖ్య 2 కోట్ల 2 లక్షల 19 వేల 104 మందిగా వున్నారు. తుది జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈసీ తెలిపింది.సర్వీసు ఓటర్లు డ్రాఫ్ట్ జాబితాలో 65 వేల 765 మంది ఉన్నారు.

అదే తుది జాబితాకి వచ్చేసరికి వారి సంఖ్క స్వల్పంగా పెరిగి 65 వేల 811 గా వుంది. ఈసర్వీసు ఓటర్లతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం ఓటర్లు డ్రాఫ్ట్ జాబితాలో 3 కోట్ల 98 లక్షల 54 వేల 093 మంది ఉన్నారు. అదే తుదిజాబితాకు వచ్చేసరికి 3 కోట్ల 99 లక్షల 84 వేల 868 గా వుంది.అత్యధికంగా గాజువాక నియోజకవర్గంలో 3,11,316 మంది ఓటర్లు వున్నారు. ఇటు అత్యల్పంగా పెడన నియోజకవర్గంలో 1,60,757 మంది ఓటర్లు మాత్రమే ఉండడం విశేషం.

Read Also: Sushanth Singh Rajputh: సుశాంత్ ఉరేసుకున్న ఫ్లాట్ అద్దెకు.. ఎన్ని లక్షల్లో తెలుసా..?