Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు ,మార్కాపురం,బాపట్ల సభల్లో చంద్ర బాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్‌పై కోడ్‌ను ఉల్లంఘిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేసారు.
Read Also: CM Jagan: మళ్లీ ముగ్గురు కూటమిగా వస్తున్నారు.. ఒకసారి ఆలోచించండి!
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ప్రాథమికంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటీసు ఇచ్చారు.