Nominations: నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nominations: ఏపీ, తెలంగాణతో పాటు నాలుగో దశలో పోలింగ్ జరిగే స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లన స్వీకరణ ప్రారంభం కానుంది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నో నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందాం.
*నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
*అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న నామినేషన్లను అనుమతిస్తారు.
*పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి,
*నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరణ
*ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ల స్వీకరణ ఉండదు.
*ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
* 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు
*అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు దరఖాస్తును పూర్తిగా పూరించారా లేదా సరి చూసుకోవాలి
*అఫిడవిట్ ప్రతి పేజీ పైన అభ్యర్థి విధిగా సంతకం చేయాలి
*పార్లమెంట్ నియోజకవర్గ పోటీకి జనరల్ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌గా 25 వేల రూపాయలు
*అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కుల ధృవీకరణ పత్రం సమర్పిస్తూ 12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్లిస్తే సరిపోతుంది
*అసెంబ్లీ నియోజకవర్గ పోటీకి జనరల్ అభ్యర్థి 10 వేలు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 5వేలు డిపాజిట్ చేయాలి
*ఇటీవలే మూడు నెలల లోపల ఫోటో తీసుకున్నట్లుగా డెకరేషన్ ఇవ్వాలి,
*2x 2.5 సెంమీ సైజు మూడు కలర్ ఫొటోలు సమర్పించాలి
*ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఎలక్ట్రోల్ రోల్ సర్టిఫైడ్ కాపీని సమర్పించాలి,
*ఇంక్‌తో సంతకం చేసిన ఫారం ఏ , బీని రిటర్నింగ్ ఆఫీసర్ కి సమర్పించాలి,
*జిరాక్స్ కాపీలు అనుమతించడం జరగదు
*అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిశీలన కొరకు నూతనంగా ఏదేని బ్యాంకు/కోఆపరేటీవ్ బ్యాంకు/పోస్టాఫీసు లో తన తెరిచిన ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి
*బ్యాలెట్ పేపర్ లో తన పేరు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఏ విధంగా ప్రచురించాలో తెలియజేయాలి
*ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే ఎంచుకున్న సింబల్ ను సూచించవలసి ఉంటుంది.
*నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల వృత్త పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించడం జరుగుతుంది.
*నామినేషన్ల దాఖలు చేసేప్పుడు అభ్యర్థితో కలిపి గరిష్టంగా 5 గురు వ్యక్తులకు మాత్రమే ఆర్ఓ ఆఫీస్‌లోకి అనుమతి
*నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంట్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
*అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పుటి నుంచి, ఎన్నికల ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
*పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు
తాజావార్తలు
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
-
Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!