NTV Telugu Site icon

Counting Votes: ఏపీలో కౌంటింగ్కు ఏర్పాట్లు.. రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు..

Ap

Ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. జూన్‌ 4వ తేదీన చేపట్టనున్న కౌటింగ్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ రూమ్స్, కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను పటిష్టం చేశారు. ఓట్లు లెక్కించేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత రిటర్నింగ్‌ అధికారి స్పందించాలని సీఈఓ మీనా వెల్లడించారు. పోలింగ్‌ ముందురోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా దాదాపు 20 కంపెనీల కేంద్ర బలగాలను ఏపీకి కేటాయించినట్లు చెప్పుకొచ్చారు.

Read Also: Sriranga Neethulu : ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్న సుహాస్ మూవీ..

ఇక, కౌంటింగ్‌ నేపథ్యంలో జూన్‌ 3, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా చెప్పుకొచ్చారు. పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులు అలర్ట్ గా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు సిబ్బందికి అదనంగా బాడీ కెమెరాలు అమర్చాలని డీజీపీ సూచించారు. దీంతో పోటు కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానం వచ్చి ప్రతి ఒక్కరిని బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.