పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీకి కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. బదిలీ, సస్పెన్షన్ అయిన వెధవలు ఖాకీ డ్రస్ వేసుకోవడానికి సిగ్గు లేదా..? అని మండిపడ్డారు. పోలీసులు అమ్ముడుపోయిన కుక్కలు.. ఈవీఎంలు పగులగొట్టిన పిన్నెలిని పట్టుకోలేని అసమర్థులు పోలీసులు అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారు.. పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టించిన అపఖ్యాతి వైఎస్ జగన్ కే దక్కుతుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అని సీపీఐ రామకృష్ణ అన్నారు.
Read Also: KL Rahul: టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఇక, 10 వేల కోట్ల రూపాయలను ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పూర్తిగా విఫలమైంది అని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలంటూ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2029 ఎన్నికలకు ఓటు వేయాలంటే అభ్యర్థి ఇంటికి వెళ్ళి కొట్టే పరిస్థితికి రాబోతుంది.. రాష్ట్ర ప్రధాన పార్టీలూ అన్ని కలిపి 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. ఎలక్షన్ కమిషన్ కూడా అమ్మడు పోయింది.. పిన్నెలి తప్పు చేసాడు కాబట్టే గన్ మెన్ లను సైతం విడిచి పెట్టి రాష్ట్రం వదలి పరారి అయాడు అని పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారు అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
