NTV Telugu Site icon

Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది..

Aaditya Thackeray

Aaditya Thackeray

Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సీఎం అంటే కరెప్ట్‌మ్యాన్‌(అవినీతిపరుడు)గా మారిందని ఎద్దేవా చేశారు. అక్రమ, రాజ్యాంగ విరుద్ధమైన ముఖ్యమంత్రి తప్పకుండా వెళ్లాల్సిందేనన్నారు.

ఉత్తర ముంబైలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో థాకరే మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ)కి కేటాయించిన మండుతున్న టార్చ్ (మషాల్) గుర్తు మాత్రమే ద్రోహం, వెన్నుపోటు కారణంగా ఏర్పడిన చీకటిని ప్రకాశవంతం చేస్తుందని అన్నారు. కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో, తుపాను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల కష్టాలను తీర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైతే.. ప్రభుత్వాన్ని కూల్చివేసే పనిలో షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పని చేశారని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రను స్వర్ణయుగానికి తీసుకెళ్తోందని మాజీ మంత్రి అన్నారు. రెండున్నరేళ్ల ఎంవీఏ హయాంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 93 శాతం పెట్టుబడి ప్రతిపాదనలు అమలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం తప్పా .. బీజేపీ చేసిందేముందని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.

Read Also: Potatoes Export: ఆగ్రా నుంచి మలేషియా, ఖతార్, దుబాయ్‌లకు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు

రైతులకు రుణమాఫీ చేయడం ఎంవీఏ ప్రభుత్వం చేసిన అతి ముఖ్యమైన పని అన్నారు. మహారాష్ట్రకు ద్రోహాలు ఇష్టం లేదని, గడువు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడానికి ఇదే కారణమని అని వర్లి ఎమ్మెల్యే అన్నారు. ఎంవీఏ పాలనలో మహారాష్ట్ర ఆకర్షించిన పెట్టుబడులను గుజరాత్‌కు (ఏక్‌నాథ్ షిండే-బీజేపీ హయాంలో) తరలించారని ఆయన అన్నారు. ముంబై నగరపాలక ఎన్నికలు ఎప్పుడు జరిగినా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. షిండే శిబిరంలోకి ఫిరాయించిన 40 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ తాము డబ్బు తీసుకోలేదని స్పష్టంగా చెప్పలేదని ఆదిత్య ఠాక్రే చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ విధేయతలను షిండే శిబిరానికి మార్చుకోవడంలో డబ్బు మార్పిడి జరిగిందని ఠాక్రే శిబిరం ఆరోపించింది.