NTV Telugu Site icon

EC Notices To Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ విషయంపై నోటీసులు ఇచ్చిన ఈసీ..!

4

4

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉలగించినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసుల అందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తన ప్రసంగాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై చర్యల నేపథ్యంలో శివ ముఖేష్ కుమార్ మీనా జగన్ మోహన్ రెడ్డికు నోటీసులు జారీ చేశారు.

Also Read: Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

ఈ నోటీసుకు సంబంధించి వచ్చే 48 గంటల్లో ఆయన వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. ఈ విషయంపై సకాలంలో స్పందించకపోతే ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోపోతున్నట్లు సీఈఓ తెలిపారు. ఇక ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నాయకులు ఎదుటి పార్టీ నాయకులు పై విమర్శలపర్వం గుప్పించడంతో చాలామందికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ నాయకుడు అచ్చం నాయుడు, అయ్యన్నపాత్రులు.. అలాగే వైస్సార్సీపీ నుండి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Also Read:Rani Rudrama Devi: కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు..

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సంబంధించి సీఈవో ముకేష్‌ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పై కూడా కేవలం 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ సూచించింది. మార్చి 31న జరిగిన ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైస్సార్సీపీ సీఈవో కు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్‌ ను ఉద్దేశిస్తూ రాక్షసుడు, జంతువు, దొంగ అంటూ చంద్రబాబు మాట్లాడారని.. వైస్సార్సీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.