Site icon NTV Telugu

Delhi: వృద్ధుడితో న్యూడ్ వీడియో కాల్.. ఫోటోలు షేర్ చేస్తానని రూ.12.8 లక్షలు స్వాహా

New Project 2023 11 03t092003.951

New Project 2023 11 03t092003.951

Delhi: ఓ మహిళతో తాను చేసిన వీడియో కాల్‌కు సంబంధించిన అశ్లీల స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి వృద్ధుడి నుంచి రూ.12.8 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన బర్కత్ ఖాన్, రిజ్వాన్‌లను ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ మంగళవారం అరెస్టు చేసింది. ఫిర్యాదు ప్రకారం, వృద్ధుడికి జూలై 18న వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ ముసలాయన దాన్ని అందుకోగానే బట్టలు లేకుండా కూర్చున్న అమ్మాయిని చూశాడు. ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాకముందే, వీడియో కాల్ సమయంలో బాధితుడి స్క్రీన్ షాట్ తీసింది అమ్మాయి. ఆ తర్వాత అతనికి వివిధ నంబర్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. ఢిల్లీ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఫోన్ చేసిన వారు బెదిరించేవారన్నారు. దీని తర్వాత, స్క్రీన్‌షాట్‌ను ఆన్‌లైన్‌లో పంచుకుంటానని బెదిరించి కాల్ చేసిన వ్యక్తులు బాధితుడి నుండి డబ్బు డిమాండ్ చేశారు.

Read Also:Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..

బాధితుడు డబ్బులు చెల్లించకపోవడంతో నిందితుడు బాలిక ఫొటోను పంపగా, అందులో ఆమె చనిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నిందితులు మళ్లీ వృద్ధుడిని బెదిరించారు. వృద్ధుడు నిందితుడు ఇచ్చిన బ్యాంకు ఖాతాకు రూ.12,80,000 బదిలీ చేశాడు. ఈ బృందం మొదట బర్కత్ ఖాన్‌ను అల్వార్‌లో అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. అతడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠా మొత్తం నడుస్తోందని, వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకునే పనిలో ఉన్నారని తేలిందని, పలు దాడులు నిర్వహించి రిజ్వాన్‌ను డీగ్‌ నుంచి అరెస్టు చేశామని మీనా తెలిపారు.

Read Also:Pallapu Govardhan: బీజేపీకి షాక్‌… నేడు కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్న పల్లపు గోవర్దన్

Exit mobile version