Site icon NTV Telugu

Double Murder : భార్యభర్తల దారుణ హత్య.. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చి..!

Murder

Murder

Double Murder : హైదరాబాద్ నగరాన్ని కలకలం రేపేలా ఓ దారుణ హత్య జరిగిన సంఘటన రాజేంద్రనగర్‌లో వెలుగుచూసింది. వృద్ధ దంపతులైన షేక్ అబ్దుల్లా , ఆయన భార్య రిజ్వానాలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వృద్ధ దంపతులు తమ నివాసంలో బెడ్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

REDMAGIC 10S Pro: మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో గేమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్ మేజిక్ 10S ప్రో లాంచ్..!

భార్యాభర్తల గొంతును కోసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ప్రాథమికంగా దోపిడీ కోణంలో ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఉన్న నగలు, నగదు లుటీ చేసినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు ముందు ఫిజియోథెరపీ చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. వారు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి వివరాలను సేకరించేందుకు పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే, మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి రావచ్చని పోలీసులు తెలిపారు.

Bhuma Akhila: రెడ్ బుక్‌ను తలుచుకొని జగన్ భయపడుతున్నారు.. భూమా అఖిల ఫైర్…

Exit mobile version