Site icon NTV Telugu

El Nino: 2024 మధ్య వరకు ఎల్ నినో.. వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు ముప్పు..

El Nino

El Nino

El Nino: ఎల్ నినో వాతావరణ పరిస్థితి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో వెచ్చటి సముద్ర ఉష్ణోగ్రత ఆధారంగా ఎల్ నినో తీవ్రతను వర్గీకరిస్తారు. తాజాగా ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, 2024 మధ్య వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి లాటిన్ అమెరికా అంతటా అసాధారణ వర్షపాతానికి దారి తీస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

Read Also: Shocking: కారు ఇంజిన్‌లో 6 అడుగుల కొండచిలువ.. షాకింగ్ వీడియో చూడండి..

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజన్ (ఎప్ఏఓ) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. దక్షిణ అమెరికా తీరం వెంబడి వేడెక్కడం ఎక్కువగా ఉంది. 2024 మొదటి త్రైమాసికంలో పెరూ, ఈక్వెడార్, మెక్సికో దేశాల్లో సాధారణం కన్నా భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా.. దీనికి విరుద్ధంగా బ్రెజిల్, గయానా, సూరినాం దేశాల్లో పొడి పరిస్థితులు ఏర్పడుతాయని భావిస్తున్నారు.

మధ్య అమెరికా ప్రాంతంలో పొడి వాతావరణ పరిస్తితులు ఈ ఏడాది చివరి వరకు ఉంటాయని అంచానా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితులు వ్యవసాయం, పంటలు, పశువుల, అడవులు, చేపలు పట్టడానికి హానికరం. ఇలాంటి తీవ్ర వాతావరణ పరిస్థిలలో 26 శాతం వరకు ఆర్థిక నష్టాలు, కరువు కాలంలో 82 శాతం వరకు నష్టాన్ని పొందగలవని ఎఫ్ఏఓ నివేదిక హైలెట్ చేసింది. పెరూ, దక్షిణ ఈక్వెడార్ ఉత్తర ప్రాంతాల్లో ఆంకోవీస్, ట్యూనా వంటి చేప జాతులు మారుతున్న వాతావరణ నమూనాల కారణంగా ప్రమాదంలో ఉన్నాయి. ఈక్వెడార్ లో 30 శాతం ట్యూనా చేపలు తగ్గాయని మత్స్యకారులు చెప్పారు.

Exit mobile version