Site icon NTV Telugu

Trolling and Job Offer: ట్రోలింగ్‌ కూడా మంచి చేసింది.. జాబ్‌ ఆఫర్‌ వచ్చింది..

Trolling And Job

Trolling And Job

Trolling and Job Offer: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అనేది ఓ వాణిజ్య ప్రకటన.. ఒక్కడ ఒకే ఒక్క మాట.. ఓ యువతిని సోషల్‌ మీడియాలో ట్రోల్ అయ్యేలా చేసింది.. చివరకు ఆ ట్రోలింగ్‌ కాస్తా ఆమెకు మంచి చేసింది.. ఉద్యోగానికి ఆఫర్‌ కూడా వచ్చేసింది.. “భారతదేశాన్ని విడిచిపెట్టడం నాల కల” అనే కామెంట్‌తో ట్రోల్ చేయబడిన విద్యార్థినికి ట్రూకాలర్‌ సీఈవో నుండి జాబ్ ఆఫర్ వచ్చింది.. కానీ, విద్యార్థిని వ్యాఖ్యలపై పలువురు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

ఇంతకీ ఆ విద్యార్థిని చేసిన కామెంట్‌ ఏమిటి? ట్రోలింగ్‌కు ఎందుకు గురైంది? జాక్‌పాట్‌ ఎలా కొట్టిందనే వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది.. అయితే, ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వెళ్లింది.. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్‌ ఎదురయ్యాడు.. సదరు విద్యార్థినిని ప్రశ్నించారు. మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు? ఏం చదువుతున్నారు? అంటూ ఏక్తాపై ప్రశ్నల వర్షం కురిపించాడు.. అయితే, యూట్యూబర్‌ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నకు స్పందించిన ఏక్తా.. భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ సమాధానం ఇచ్చారు.. అంటే, బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ, ఆమె సమాధానంపై నెటిజన్లు మండిపడ్డారు.. స్వదేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్‌ చేశారు.. ఆమెపై రకరకాలుగా కామెంట్లు పెట్టారు..

కానీ, ఆ ట్రోలింగే ఆ విద్యార్థినికి జాబ్‌ ఆఫర్ తెచ్చిపెట్టింది.. అదేలా అంటే.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రూల్‌ కాలర్‌ సీఈవో అలాన్ మామెడి రియాక్ట్‌ అయ్యారు.. బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు.. అంతేకాదు.. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్‌ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్‌ ఆఫర్‌ ఇచ్చేశారు. మామెడి ట్వీట్‌ను పరిశీలిస్తే.. మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు.. ట్రోలింగ్‌ చేయడం సరికాదు.. అని హితవుపలికారు.. నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు అంటూ ఏక్తాకు ధైర్యాన్ని చెప్పిన ఆయన.. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా.. వాటితోనే కలిసి జీవిస్తున్నావు అని పేర్కొన్నాడు. అంతేకాదు.. మొదట చదువు పూర్తి చేయండి.. ట్రూ కాలర్‌లో పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అంఊ తన ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు ట్రూల్‌ కాలర్‌ సీఈవో అలాన్ మామెడి.. మొత్తంగా ఓకే మాటతో ట్రోలింగ్‌ కావడమే కాకుండా.. జాబ్‌ ఆఫర్‌ కూడా తెచ్చిపెట్టిందన్నమాట..

Exit mobile version