Trolling and Job Offer: ట్రోలింగ్ కూడా మంచి చేసింది.. జాబ్ ఆఫర్ వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trolling and Job Offer: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అనేది ఓ వాణిజ్య ప్రకటన.. ఒక్కడ ఒకే ఒక్క మాట.. ఓ యువతిని సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేలా చేసింది.. చివరకు ఆ ట్రోలింగ్ కాస్తా ఆమెకు మంచి చేసింది.. ఉద్యోగానికి ఆఫర్ కూడా వచ్చేసింది.. “భారతదేశాన్ని విడిచిపెట్టడం నాల కల” అనే కామెంట్‌తో ట్రోల్ చేయబడిన విద్యార్థినికి ట్రూకాలర్ సీఈవో నుండి జాబ్ ఆఫర్ వచ్చింది.. కానీ, విద్యార్థిని వ్యాఖ్యలపై పలువురు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
ఇంతకీ ఆ విద్యార్థిని చేసిన కామెంట్ ఏమిటి? ట్రోలింగ్‌కు ఎందుకు గురైంది? జాక్‌పాట్ ఎలా కొట్టిందనే వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది.. అయితే, ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వెళ్లింది.. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ ఎదురయ్యాడు.. సదరు విద్యార్థినిని ప్రశ్నించారు. మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు? ఏం చదువుతున్నారు? అంటూ ఏక్తాపై ప్రశ్నల వర్షం కురిపించాడు.. అయితే, యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నకు స్పందించిన ఏక్తా.. భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ సమాధానం ఇచ్చారు.. అంటే, బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ, ఆమె సమాధానంపై నెటిజన్లు మండిపడ్డారు.. స్వదేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేశారు.. ఆమెపై రకరకాలుగా కామెంట్లు పెట్టారు..
Also Read
కానీ, ఆ ట్రోలింగే ఆ విద్యార్థినికి జాబ్ ఆఫర్ తెచ్చిపెట్టింది.. అదేలా అంటే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి రియాక్ట్ అయ్యారు.. బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు.. అంతేకాదు.. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చేశారు. మామెడి ట్వీట్‌ను పరిశీలిస్తే.. మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు.. ట్రోలింగ్ చేయడం సరికాదు.. అని హితవుపలికారు.. నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు అంటూ ఏక్తాకు ధైర్యాన్ని చెప్పిన ఆయన.. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా.. వాటితోనే కలిసి జీవిస్తున్నావు అని పేర్కొన్నాడు. అంతేకాదు.. మొదట చదువు పూర్తి చేయండి.. ట్రూ కాలర్‌లో పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అంఊ తన ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి.. మొత్తంగా ఓకే మాటతో ట్రోలింగ్ కావడమే కాకుండా.. జాబ్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టిందన్నమాట..
People really want to misunderstand her to make fun of her. This is not OK!! Ekta, don't listen to all these clowns making fun of you. I think you're cool and living the dream! When you're done with school, you're welcome to work at Truecaller in any of our offices around the 🌏 https://t.co/PuotNAMwKK
— Alan Mamedi (@AlanMamedi) August 3, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!