NTV Telugu Site icon

Terrorists Arrest: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర.. తిప్పికొట్టిన పోలీసులు

Terrorists

Terrorists

దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర భారీ కుట్ర పన్నిన ఓ గ్యాంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అరెస్టయిన అన్సార్‌-అల్‌-ఇస్లామ్‌ బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మంది అనుమానిత సభ్యులను అరెస్ట్ చేశారు. వీళ్లు ‘చికెన్‌ నెక్‌’పై దాడి చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈ మేరకు పోలీసు ఓ ఉన్నతాధికారి సమాచారం అందించారు. ‘చికెన్ నెక్’ అనేది పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కారిడార్. సిలిగురి కారిడార్‌లో వరుస దాడులు చేసి.. పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించాలన్నది వీళ్ల ప్లాన్.

READ MORE: Elon Musk: ‘‘చేతకాని దద్దమ్మ’’..టెర్రర్ అటాక్‌పై జర్మనీ ఛాన్సలర్‌ని తిట్టిన మస్క్..

పశ్చిమ బెంగాల్ పోలీసులు ముర్షీదాబాద్ జిల్లాలో అరెస్టయిన ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు అనుమానితుల నుంచి పెన్ డ్రైవ్‌లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్, కేరళ, అస్సాం పోలీసులు పట్టుకున్న ఎనిమిది మంది వ్యక్తుల బృందంలో వీరు కూడా ఉన్నారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) సుప్రతిమ్ సర్కార్ శుక్రవారం విలేకరులతో చెప్పారు. సిలిగురి కారిడార్ అని కూడా పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక మార్గమైన ‘చికెన్ నెక్’ అని తెలిపారు. ఆయా ప్రాంతాన్ని లక్ష్యం చేసుకునేందు తమ వద్ద నిర్దిష్ట ప్రణాళిక ఉందని విచారణలో తేలిందని చెప్పారు. ఆగస్టు నుంచి యాక్టివ్‌గా ఉన్న సంస్థకు చెందిన ‘స్లీపర్ సెల్’ గురించి రాష్ట్ర పోలీసులకు సమాచారం అందిందని ప్రభుత్వం తెలిపింది.

READ MORE: CM Revanth Reddy: అల్లు అర్జున్‌ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?

“అబ్బాస్ అలీ, మినారుల్ షేక్‌ అనే ఇద్దరు అనుమానితుల నుంచి 16 GB పెన్ డ్రైవ్, కొన్ని జిహాదీ పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. వారు దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న స్లీపర్ మాడ్యూల్‌లో భాగమైనట్లు అనుమానిస్తున్నాం. ఉత్తర బెంగాల్‌లోని సున్నితమైన ప్రాంతాలతో పాటు ఈశాన్య ఏడు రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. వారు ముర్షీదాబాద్, అలీపుర్‌దూర్ జిల్లాలలో ఆశ్రయం పొందారు. వారు ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకున్నారు. ”అని సుప్రతిమ్ సర్కార్ వెల్లడించారు.

Show comments