NTV Telugu Site icon

Bengaluru: బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్..

2

2

బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుంది. దీంతో వారు సోదాలు నిర్వహించారు.

also read: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..

అయితే అక్కడికి చేరుకోగానే నైజీరియా జాతీయులు పోలీసులపై దాడి చేశారు. రాష్ట్ర పారామిలటరీ దళం దిస్వాట్‌ తో కలిసి సీసీబీ అధికారులకు ప్రతిఘటన ఎదురైంది. వాగ్వాదం సందర్భంగా నిందితులు పోలీసు వాహనం అద్దాన్ని ధ్వంసం చేసి నలుగురు అధికారులను గాయపరిచారు. సంఘటన స్థలం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించినప్పటికీ., కొద్దిసేపటికే నిందితులు పట్టుబడ్డారు. రాజానుకుంట పోలీస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

also read: Lok Sabha Election 2024: నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ, కేరళలో ప్రియాంక గాంధీ రోడ్ షో..

గాయాలపాలైన పోలీసులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారో. ఏకంగా పోలీసులపైనే దాడి చేశారంటే డ్రగ్స్ ముఠా మనుషులు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ప్రస్తుతం దేశంలోని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యల నిబంధనలలో వారి ఆటలు సాగకపోవడంతో ఇలాంటి దుచర్యలకు తెగబడుతున్నారు.