NTV Telugu Site icon

Roman City : ఈజిప్టులో అతి పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్న ఆర్కియాలజిస్టులు

Egypt

Egypt

Roman City : ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 1,800 సంవత్సరాల పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్నారు. ఈజిప్టులోని లక్సోర్ నగరం ఈ ఆవిష్కరణకు వేదికైంది. ఈ నగరం రెండు లేదా మూడవ శతాబ్దానికి చెందినది ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. ఈ కాలంలో ప్రజలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసించి ఉంటారని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ ముస్తఫా వజీరి తెలియజేశారు. నగరంలో చాలా నివాస భవనాలు సురక్షితమైన స్థితిలో ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రజలు పావురాల కోసం ఎత్తైన ఇళ్లను కూడా నిర్మించారు. వజీరి దీనిని లక్సోర్ తూర్పు ఒడ్డున కనుగొన్న అత్యంత ముఖ్యమైన పురాతన నగరంగా వర్ణించాడు.

Read Also : Journalist Tortured: జర్నలిస్టుని చెట్టుకు కట్టేసి టార్చర్.. ఎందుకో తెలుసా?

పరిశోధకులు నగరంలో పాత్రలు, పనిముట్లు, కాంస్య రోమన్ నాణేలు దొరికిన అనేక ప్రదేశాలను కూడా కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ అరుదైన ఆవిష్కరణగా ఆయన అభివర్ణించారు. పరిశోధకులు లక్సోర్‌లోని నైలు నది పశ్చిమ ఒడ్డున తవ్వకాలను ప్రారంభించారు. ఆ క్రమంలో వారు ఈ నగరాన్ని కనుగొన్నారు. నైలు నది పరివాహక ప్రాంతం పురాతన దేవాలయాలు, సమాధులు మొదలైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవలి సంవత్సరాలలో అనేక ప్రధాన ఆవిష్కరణలు చేశారు. ఏప్రిల్ 2021లో, అతను లక్సోర్ పశ్చిమ తీరంలో మూడువేల సంవత్సరాల క్రితం నాటి గోల్డెన్ టౌన్ కనుగొన్నారు. ఈ నగరం ఈజిప్టులో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద పురాతన నగరంగా పరిగణించబడుతుంది.

Read Also: Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‎కు గురైన ఓనర్

ఈజిప్టు ప్రభుత్వం పురావస్తు ఆవిష్కరణలపై దృష్టి పెడుతోంది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈజిప్టు పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈజిప్టులో పర్యాటకం GDPలో 10 శాతం వాటాను కలిగి ఉంది. అది నేరుగా రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకులు ఈజిప్ట్‌కు రావడం మానేశారు. అంటువ్యాధి వ్యాప్తి ముగుస్తుంది అనుకుంటుండగానే, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈజిప్టులో ఎక్కువ మంది పర్యాటకులు ఉక్రెయిన్- రష్యా నుండి వస్తారు. ఈ యుద్ధం ఈజిప్టు పర్యాటక పరిశ్రమను భారీ నష్టాల్లోకి నెట్టింది.

Read Also: Harish Rao : అత్యంత ప్రతష్టాత్మకంగా వరంగల్‌లో హెల్త్ సిటీ

ఈజిప్టు ప్రభుత్వం పురావస్తు పరిశోధనల ద్వారా పర్యాటక పరిశ్రమను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్టు ప్రభుత్వం కూడా ఈ ఆవిష్కరణల ద్వారా తన గ్లోబల్ ఇమేజ్‌ను మెరుగుపరుచుకుంటోంది. ఈజిప్టులో, 2014కి ముందు సంవత్సరాలపాటు రాజకీయ అశాంతి నెలకొని ఉంది. దీని కారణంగా పర్యాటకం నష్టపోయింది. కానీ ఇప్పుడు ఈజిప్టులోని అబ్దెల్ ఫతే అల్-సిసి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం.. ఇమేజ్‌ని మార్చడం కోసం పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రభుత్వం కూడా పురావస్తు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. జనవరి ప్రారంభంలో, ఈజిప్ట్‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు థీబన్ నెక్రోపోలిస్‌లోని రెండు పురాతన సమాధులలో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న తొమ్మిది మొసళ్ల పుర్రెలను కనుగొన్నారు.