NTV Telugu Site icon

Eetala Rajendar: ముడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం

Etela Rajendar

Etela Rajendar

Eetala Rajendar: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధాని గా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రం లో నిర్వహించిన సమావేశంలో ఈటల మాట్లాడారు. రాష్ట్రం లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు. కేసీఆర్ అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలని మర్చిపోయారని.. ఫలితంగా చిత్తుగా ఓడిపోయారన్నారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదని.. రాష్ట్రానికి కూడా ఒరిగేదేమి ఉండదన్నారు.

Read Also: Neha Murder Case: “నా కొడుకు చేసింది తప్పే”.. క్షమాపణలు కోరిన నిందితుడు ఫయాజ్ తల్లి..

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి రైతులను పూర్తిగా మోసం చేశారని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ చేసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డి కి లేదని.. కల్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిన హామీ సైతం అమలు చేయలేదన్నారు. 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అంటున్న రేవంత్ రెడ్డి కి చెప్తున్నా.. జీవితంలో రాహుల్ ప్రధాని అవ్వలేరు.. ఆ కల పగటి కలగానే మారుతుందన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవాలని చూస్తున్నారే తప్పా.. ప్రజల సంక్షేమం కోసం పనిచెయ్యట్లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్ లు… బీజేపీ అంటే అభివృద్ధి కి బాటలు వేసే పార్టీ అన్నారు.