Eesha Rebba : టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .చిన్న సినిమాలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.అయితే అనుకోకుండా ఓ పెద్ద సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చింది.ఆ సినిమానే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’.అయితే ఈ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా 2018 అక్టోబర్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.ఈ సినిమా లో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈషా రెబ్బా సెకండ్ హీరోయిన్ గా నటించింది.
అయితే ఈషా రెబ్బ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను నటించిన మొదటి పెద్ద చిత్రం ‘అరవింద సమేత’.ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ నన్ను సంప్రదిస్తే నటించేందుకు నేను ఆసక్తి చూపలేదు.మెయిన్ హీరోయిన్ గా చేయాలనీ వుంది అని చెప్పాను. అయితే ఈ సినిమాలో మీదీ ప్రధాన పాత్రే’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత నటించడానికి ఒప్పుకున్నాను. నాపై ఓ పాట కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ, అది జరగలేదు.అయితే ఇంకొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తొలగించారు వీటికి కారణమేంటో నాకు తెలియదు.ఆ సినిమా విషయంలో మాత్రం బాధ ఉండేది. కానీ, ఎన్టీఆర్‌తో నటించడం, త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది.