Eesha Rebba: గత కొద్దిరోజులుగా హీరోయిన్ ఈషా రెబ్బ, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం మీద వీరిద్దరూ నేరుగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ.
అయితే, తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా “ఓం శాంతి శాంతిః” అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జనవరి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, సినిమా టీం ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బ ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఈ విషయం మీద ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.
జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆమె పేర్కొంది. తన తండ్రి కూడా ఈ వార్తలు చూసి, “పెళ్లెప్పుడు?” అని అడుగుతున్నట్లుగా ఆమె పేర్కొన్నది. అయితే, ఈ ప్రచారమేమీ నిజం కాదని, తాను ఒకరితో డేట్ చేస్తున్న మాట వాస్తవమే అని, అయితే అది పూర్తిగా ఎర్లీ స్టేజ్ లోనే ఉందని, ఇంకా పెళ్లి ఆలోచనలు ఏవి చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అది తరుణ్ భాస్కర్ తోనా కాదా అన్న విషయంపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఆ డేటింగ్ విషయాన్ని కూడా చాలా తెలివిగా ఆమె “తాను డేట్ చేస్తున్నాను” అనే విషయాన్ని (నేరుగా) చెప్పకుండా, “ఐ యామ్ సీయింగ్ సం వన్” అంటూ కామెంట్ చేసింది.
JSW Motors తొలి SUV ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో భారత మార్కెట్‌లోకి Jetour T2 i-DM..!
దాని Gen Z పరిభాషను గమనిస్తే.. ఒక లవ్ రిలేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, ఒక రకంగా డేటింగ్ చేస్తున్నట్టే. కానీ అధికారికంగా “బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్” అని చెప్పుకునేంతలా ఇది ఇంకా పూర్తిగా డీప్ గా వెళ్ళినట్టు కాదు. ఈషా కామెంట్స్ మాత్రం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
