Edupayala Jatara: నేటి నుంచి ఏడు పాయల జాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు
Edupayala Jatara: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉన్న ఏడు పాయల వనదుర్గా భవాని జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు వనదుర్గా భవాని జాతర కొనసాగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత జరిగే రెండో అతిపెద్ద వనజాతర కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. మంజీరా నదిలో పుణ్యాస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏడూ ఉప నదులు కలిసి గోదావరి నదికి ఉపనది అయినా మంజీరా నదిలో కలుస్తాయి. అందుకే దీనికి ఏడుపాయల అనే పేరు వచ్చింది.
Read Also: Mahashivratri 2024: శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు
Also Read
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఆలయం ఉంటుంది. మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకోదగినది. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంజీరా నదిలో పుణ్యస్థానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి శివరాత్రి సందర్భంగా 03 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. నేడు మహాశివరాత్రి ఉత్సవాలు,9న బండ్లు తిరుగుట,10న రథోత్సవం వైభవంగా జరుగుతాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!