NTV Telugu Site icon

PM Modi: భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ మనకు అవసరం..

Pm Modi

Pm Modi

భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ ప్రస్తుతం మనకు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యసమాజ్‌ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఆయన స్వస్థలమైన టంకారాలో నిర్వహించిన వేడుకను ఉద్దేశించి ఆదివారం నాడు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.

Read Also: Revenue Employees Pen Down: ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన.. రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్..

ఈ సందర్భంగా భారతీయ విలువల బోధనకు కేంద్రంగా ఆర్యసమాజ్‌ పాఠశాలలు నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. బానిసత్వం, మూఢనమ్మకాలతో దేశం కునారిల్లుతున్న కాలంలో జన్మించిన దయానంద సరస్వతి.. వాటి వల్ల శాస్త్రీయ ఆలోచనలు ఎలా బలహీనపడుతున్నాయో తెలియజెప్పి చైతన్యం కలిగించారని ఆయన గుర్తు చేశారు. వేదాలకు తార్కిక వివరణలు ఇచ్చి, వాటి గొప్పతనాన్ని ఆయన తెలియజేశారన్నారు. భారతీయ తత్వమంటే ఏమిటో బ్రిటిష్‌ పాలకులకు చాటి చెప్పారని ప్రధాని తెలిపారు. ఎంతో మందిని ఆర్య సమాజం ప్రభావితం చేసిందని ఆయన తెలిపారు. దయానంద సరస్వతి జన్మించిన రాష్ట్రంలో తాను పుట్టడం, ఆయన కర్మభూమిగా భావించే హరియాణా గురించి బాగా తెలుసుకోవడం వల్ల తన జీవితంపై ఆయన ప్రభావమెంతో ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.