NTV Telugu Site icon

TS Education Commission: ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదు: విద్యా కమిషన్ ఛైర్మన్

Akunuri Murali

Akunuri Murali

ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని, ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యెక వ్యవస్థ ఉండాలన్నారు. మాతృ భాష నేర్చుకోవాలి కానీ.. మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్ కాదని ఆకునూరి మురళీ పేర్కొన్నారు.

‘ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలి. ఈ విషయమై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలను స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసంబద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక స్కూల్లో అప్లికేషన్ ఫీజు రూ.4,500గా ఉంది. స్కూల్స్ సేల్స్ యాక్టివిటీ నుండి పూర్తిగా బయటకు రావాలి. ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకుంటుంది. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి’ అని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు.

Also Read: Crime News: వైఫ్ కాదు నైఫ్.. కట్టుకున్నోడిని కాటికి పంపిన భార్య!

‘మాతృ భాష నేర్చుకోవాలి కానీ.. మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్ కాదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలని అనుకోవడం సమంజసం కాదు.స్కూల్లోకి ఎఫ్డీఐలు కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి లేక రాస్తాము. స్కూల్లను కేటగిరీలుగా విభజిస్తాం. ఒక వారంలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తాము’ అని విద్యా కమిషన్ ఛైర్మన్ తెలిపారు.

Show comments