Site icon NTV Telugu

TSPSC : గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌..

Tspsc

Tspsc

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడదుల చేసిన విషయం తెలిసిందే. అలాగే వాటిల్లో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్‌ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. అయితే గత నెలలో గ్రూప్‌-1 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే.. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పులు దొర్లాయని.. కావున ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 21వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులలో పొరపాట్లను ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే.. అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అయితే గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గత నెల 4తో ముగిసింది.

 

Exit mobile version