Site icon NTV Telugu

Tamilnadu-BJP: తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ స్కెచ్.. నేడు కీలక భేటీ!

Delhi Bjp

Delhi Bjp

తమిళనాడులో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహరచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేతో మరోసారి పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కలిసి సుముఖత తెలిపారు. అయితే బీజేపీతో పొత్తుకు షరతులు విధించారు.

Also Read: One Nation One Election: 2029 తర్వాతే జమిలి ఎన్నికలు: నిర్మలా సీతారామన్‌

బీజేపీ చీఫ్ అన్నామలైని మార్చాలని ఎడప్పాడి పళనిస్వామి పట్టుపట్టారు. ఇప్పటికే అన్నామలై రాజీనామా చేశారు. మరో 2-3 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈరోజు రామేశ్వరం పర్యటన అనంతరం ప్రధాని మోడీతో ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి), మాజీ సీఎం పన్నీర్ సెల్వం వేర్వేరుగా భేటీ కానున్నారు. మదురై ఎయిర్‌పోర్ట్‌లో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే బీజేపీ అలయెన్స్‌లో శశికళ మేనల్లుడు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షులు టీటీవీ దినకరన్ కొనసాగుతున్నారు. ఈ ముగ్గురితో కలిసి కూటమి ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. డీఎంకేపై వ్యతిరేకత, సంప్రదాయ ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.

Exit mobile version