NTV Telugu Site icon

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు

Arvind Kejriwal

Arvind Kejriwal

Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ అధికారులు సమన్లు ​​పంపించారు. జనవరి 18న విచారణలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది నాలుగోరి సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందు, అరవింద్ కేజ్రీవాల్‌కు మూడు సమన్లు ​​జారీ చేయబడ్డాయి.. కానీ అతను ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు.

Read Also: Asifabad: కాగజ్‌ నగర్‌ పులులు చంపిన కేసు.. ముగ్గురు నిందితుల్లో ఒకరు 11 ఏళ్ల బాలుడు

ఇక, జనవరి 3న అరవింద్ కేజ్రీవాల్‌కు మూడోసారి సమన్లు ​​పంపగా.. ఆ నోటీసులను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో ఆప్ చీప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.. ఇప్పటి వరకు మూడు సార్లు సమన్లను పంపించిన పట్టించుకోలేదు ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు. అయితే, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు జారీ చేసిన సమన్లపై ఈడీ ముందు హాజరు కావడానికి నిరాకరించారు.

Read Also: Hanuman: అక్కడ గుంటూరు కారం సినిమాని బీట్ చేసిన ఇండియన్ సూపర్ హీరో

అయితే, ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, అలాగే, ఈ ఏడాది జనవరి 3న విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ, తొలి సమన్లలో కేజ్రీవాల్ ఎన్నికల సమావేశానికి వెళ్లగా, రెండో సమన్ల సమయంలో విపాసన కోసం వెళ్లారు.. మూడో సారి జారీ చేసిన నోటీసులను అస్సలు పట్టించుకోకపోవడంతో ఇవాళ నాలుగోవ సారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన తప్పకుండా ఈడీ ముందుకు రావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Read Also: Citigroup Layoffs: 20వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న.. సిటీ గ్రూప్

వాస్తవానికి, ఢిల్లీ మద్యం కుంభకోణం 2021-22లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని అమలుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా.. వెంటనే ఆప్ ప్రభుత్వం 2022లో దాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేయగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 4న సంజయ్ సింగ్ అరెస్టయ్యాడు.