Hanuman: అక్కడ గుంటూరు కారం సినిమాని బీట్ చేసిన ఇండియన్ సూపర్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి మొదలైపోయింది. ఫస్ట్ వార్ ని స్టార్ట్ చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేసాయి. ఈ సినిమాల్లో రిలీజ్ కి ముందు గుంటూరు కారంపై అంచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అంచనాలని తారుమారు చేస్తూ డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పాజిటివ్ మౌత్ టాక్ తో హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా థియేటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ హిట్ టాక్ ఏ సినిమాకి రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా మైటీ గుంటూరు కారం ముందు కూడా రాక్ సాలిడ్ గా నిలబడింది. నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమాని డే 1 కలెక్షన్స్ విషయంలో హనుమాన్ బ్రేక్ చేసింది. గుంటూరు కారం డే 1 నార్త్ అమెరికాలో 400K వరకు కలెక్ట్ చేస్తే హనుమాన్ హాఫ్ మిలియన్ డాలర్స్ ని దాటేసింది. హనుమాన్ సినిమా మహేష్ అడ్డా అయిన నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమాని డామినేట్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈరోజుతో హనుమాన్ మూవీ 1 మిలియన్ రీచ్ అయ్యి… బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోనుంది. హనుమాన్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునే మొదటి సెంటర్ నార్త్ అమెరికానే అయ్యే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..