FIR On KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విషయంలో తెలంగాణలోని ఏసీబీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లేఖ రాసింది. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ ఖాతాల నుంచి నగదు బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు దాన కిషోర్ కేసు వివరాలను కూడా పంపాలని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేసినా, ఎప్పుడు నగదు బదిలీ జరిగిందో వంటి వివరాలను స్పష్టంగా అందించాలని ఈడీ స్పష్టం చేసింది.
Also Read: Zia ur Rahman Barq: కరెంటు దొంగిలించిన కేసులో ఎంపీకి భారీగా ఫైన్ విధించిన ప్రభుత్వం
ఈడీ తన ఎంక్వైరీ రెగ్యులర్ ప్రాసెస్‌లో భాగమే అయినప్పటికీ, బీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ నేతల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశాలకు రూ. 45.71 కోట్లు బదిలీ చేసినందుకు హెచ్ఎండీఏపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ. 8,06,75,404 జరిమానా విధించింది. అదనంగా, వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు రూ. 1,10,51,014 ను చెల్లించింది. మొత్తం ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం రూ. 54 కోట్లకు పైగా హెచ్ఎండీఏ చెల్లించింది. హెచ్ఎండీఏ రూల్స్ ప్రకారం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న చెల్లింపులు చేయాలంటే.. ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండలు. కానీ, ఆ సమయంలో ఈ నిబంధనలను పాటించకుండానే చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
Also Read: KTR Comment: సీఎం రేవంత్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..