ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్‌గా మోసాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి భారీ సోదాలు నిర్వహించారు. విదేశీ పౌరులు, ముఖ్యంగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ముఠాపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. కీలక నిందితుడు వికాస్ నిమార్ను అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పన్ను, రుణాల పేరుతో బెదిరింపులు..
దర్యాప్తులో భాగంగా నిందితులు అమెరికా ప్రభుత్వ విభాగాల అధికారులమని బాధితులను నమ్మించి, పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం ఉందంటూ భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించడం, డిజిటల్ చెల్లింపులు చేయించడం ద్వారా కోట్ల రూపాయలను అక్రమంగా సేకరించినట్లు విచారణలో తేలింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
క్రిప్టోకరెన్సీగా అక్రమ సంపాదన:
బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి వద్ద సుమారు 12 వేల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీ, అలాగే రూ.13.5 లక్షల నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని పలు నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని కేంద్రాల్లో ఒకే తరహా మోసపూరిత విధానాన్ని అనుసరించినట్లు ఈడీ గుర్తించింది.
మనీలాండరింగ్:
సైబరాబాద్ పోలీసులు, ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులో మహమ్మద్ అన్సారి అలియాస్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారి, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి, వికాస్ కె. నిమార్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ వి. రాథోడ్లను నిందితులుగా పేర్కొంది.
డ్రగ్స్ కేసులోనూ..
ఫేక్ కాల్ సెంటర్ కేసుతో పాటు మరోవైపు బెంగళూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!