NTV Telugu Site icon

ED: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ అధికారిక ప్రకటన..

Kavitha

Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది.

Flight Landing: హైవేపై ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. కారణమిదే..!

వందకోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది.. ఆప్ నేతలకు వంద కోట్లు చెల్లింపులో కవితది కీలకపాత్ర అని ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు 240 చోట్ల సోదాలు చేశాం.. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలో సోదాలు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 5 సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామని తెలిపింది. అంతేకాకుండా.. రూ. 128 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేశాం.. మనీష్‌సిసోడియా, సంజయ్‌సింగ్‌, విజయ్‌నాయర్‌లతో కవితకు లింక్‌లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

NDA Alliance: ఏపీ సీఈఓతో ఎన్డీఏ కూటమి నేతల భేటీ.. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఫిర్యాదు

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను కలవనున్నారు. కాగా.. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది. అందులోభాగంగా ఈరోజు వీరిద్దరూ కలువనున్నారు.

 

Show comments